ASR: గిరిజన సంక్షేమ ఆశ్రమాల్లో పారిశుద్ధ్య, వంట సిబ్బంది నియామకానికి అధికారులు చర్యలు వేగవంతం చేశారు. జిల్లాలోని 122 ఆశ్రమాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఒక ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి, వార్డెన్లకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తామని గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పోస్టుల భర్తీ!


