హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

BPT: చీరాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం ఉదయం 9:30 గంటలకు CMRF చెక్కులను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పంపిణీ చేయనున్నారు. నియోజకవర్గానికి చెందిన 110 మంది లబ్ధిదారులకు రూ.64 లక్షల విలువైన చెక్కులను అందజేయనున్నట్లు క్యాంప్ కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమంలో కూటమి ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.