వరంగల్ నగరంలో రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతికి కారణమైన వ్యక్తిని మట్టెవాడ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. హంటర్‌రోడ్డుకు చెందిన కొండపర్తి రాజు ఈ నెల 23న మద్యం సేవించి కారును అతివేగంగా నడుపుతూ రోడ్డుపై ఉన్న కానిస్టేబుల్ కాసుల శ్రీనివాస్ (43)తో పాటు మరికొందరిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.
తెలంగాణ
కానిస్టేబుల్ మృతికి కారణమైన వ్యక్తి అరెస్టు..


