హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

AKP: పరవాడ మండలంలో శనివారం పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ మురళీకృష్ణ తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పనులు చేపడుతున్న కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పరవాడ సినిమా హాల్ జంక్షన్, బీటీఆర్ నగర్, బిసి కాలనీ, కొత్తకాలనీ, ఎస్టీటీఎల్ టౌన్షిప్, గొర్లివానిపాలెం, దేశపాత్రునిపాలెంకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నామన్నారు.