ELR: జిల్లాలో అర్హులైన ప్రతి ఆక్వా రైతుకు విద్యుత్ సబ్సిడీ అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌లో ఆక్వా రైతులకు సబ్సిడీ, సంక్షేమ పథకాలపై సమీక్షించారు. జిల్లాలో 13,508 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 9,730 కనెక్షన్లకు యూనిట్ రూ.1.50కే సబ్సిడీ అందుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
అర్హులైన ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ : కలెక్టర్


