ADB: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలోని ఈతకొలనులో నీరు నాణ్యత దెబ్బ తినడంతో సెప్టెంబర్ 1వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు నిర్వాహకులు రాష్ట్రపాల్ శుక్రవారం తెలిపారు. కొలనులోని పాత నీటిని తొలగించి కొత్త నీటిని నింపుతామన్నారు. సాధకుల భద్రత, నీటి నాణ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఇందిరా ప్రియదర్శిని ఈతకొలను మూసివేత


