హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేయర్‌ అభ్యర్థి రేసులో ఐదుగురు

విజయనగరం కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థి రేసులో కూటమి నుంచి ఐదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. వీరంతా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారేనని సమాచారం. టీడీపీకి చెందిన పలువురు నాయకులు మేయర్‌ పదవిపై ఆశలు పెట్టుకుని అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు ఈ అంశంపై గోప్యత పాటిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి విషయంలో మౌనంగా ఉంది.