హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండవాగుల నీటితో ఖరీఫ్ సాగు

PPM: ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు తోడు జిల్లాలో వానలతో ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, గెడ్డలు ఉప్పొంగుతున్నాయి. వీటి నీటిని వినియోగించుకుని రైతులు ఖరీఫ్ సాగు పనులు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాలో 72,829 హెక్టార్లలో వరి సాగు లక్ష్యం కాగా ఇప్పటివరకు 49,709 హెక్టార్లలో నాట్లు పూర్తయ్యాయని పాలకొండ డీఏవో భవానీశంకర్ తెలిపారు.