PLD: వినుకొండ హైటెక్ బజారులో తప్పిపోయిన శ్రీ నిత్య అనే చిన్నారిని పోలీసులు తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. చిన్నారి పోలీస్‌స్టేషన్‌లో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న తండ్రి కొండ, తల్లి నాగలక్ష్మి అక్కడికి చేరుకుని చిన్నారిని తీసుకెళ్లారు. తమ బిడ్డను సురక్షితంగా అప్పగించిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నారి మిస్సింగ్ కేసు సుఖాంతం!


