హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమరవీరులకు నివాళులు అర్పించిన నేతలు

PDPL: ఎన్టీపీసీ మేడిపల్లి లో శుక్రవారం సీపీఎం నాయకులు, విద్యుత్ అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2000 ఆగస్టు 28న బషీర్‌బాగ్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామి త్యాగాలను స్మరించారు. విద్యుత్ సవరణ చట్టం-2025ను ఉపసంహరించుకోవాలని, ఉచిత విద్యుత్‌కు ఆటంకం కలిగించే చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.