హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య!

NDL: ప్యాపిలి (M) గార్లదిన్నెలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుప్రియ (22) శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని మృతి చెందింది. రంగు విషయమై అత్తమామలు వేధించడంతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. సుప్రియకు 18 నెలల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. తల్లి లక్ష్మిదేవి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.