హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రిడ్జి నిర్మాణం సాధనే లక్ష్యం: సుభాష్

కోనసీమ: కోటిపల్లి-ముక్తేశ్వరం బ్రిడ్జి నిర్మాణం సాధిస్తానని మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీ ఇచ్చారు. శుక్రవారం రామచంద్రపురంలో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఆయన ఈ ప్రకటన చేశారు. రెండేళ్లలో నియోజకవర్గానికి రూ. 250 కోట్లు తెచ్చామని, ఈ బ్రిడ్జి పూర్తయితే గోదావరి ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభం అవుతాయన్నారు. సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు.