MDK: తూప్రాన్ మండలంలోని యావాపూర్ వద్ద ఇటీవల జరిగిన రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాచారం గ్రామానికి చెందిన కట్టే వెంకటేష్ (56) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు. ఈనెల 20న బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ వేగంగా ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం


