హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీట్ (పీజీ) పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: DRO

ATP: ఈ నెల 30న నీట్ (పీజీ) పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని DRO ఏ. మలోల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలోని 5 కేంద్రాల్లో 979 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. నిరంతర విద్యుత్, ప్రత్యేక బస్సులు, సీసీ కెమెరాలు, భద్రత కల్పించాలని సూచించారు.