హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొదుపు సమితిపై ఆరోపణలు..!

PDPL: మంథని మదర్‌ థెరిసా మహిళా పొదుపు సమితిపై అధిక వడ్డీలు, వడ్డీపై వడ్డీ వసూలు చేస్తున్నారంటూ కొందరు సభ్యులు ఆరోపణలు చేస్తున్నట్లు గంగాపురికి చెందిన నామని హరికృష్ణ తెలిపారు. 2002 నుంచి సమితి ఆర్థిక లావాదేవీలు, పొదుపు, రుణాలు, వడ్డీల వివరాలను పూర్తిగా పరిశీలించాలని కోరారు. సమితి చైర్మన్‌ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి, మహిళల సొమ్ముకు లెక్కలు చూపాలన్నారు.