హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్యాషియర్‌పై రౌడీషీటర్ దాడి..!

JGL: కోరుట్లలో బార్ క్యాషియర్‌పై దాడి చేసి హత్యకు ప్రయత్నించిన ఘటనలో రౌడీషీటర్ బింగి అలియాస్ బంగి నగేష్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై శ్యామ్‌రాజ్ తెలిపారు. బీర్ ఇవ్వాలని క్యాషియర్‌ను నగేష్ దుర్భాషలాడి, చేతికి ఉన్న స్టీల్ కడియంతో దాడి చేయడంతో గాయాలయ్యాయన్నారు. అనంతరం బీర్ బాటిల్‌తో దాడికి యత్నించగా క్యాషియర్ తప్పించుకున్నట్లు పేర్కొన్నారు.