హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు ఛాన్స్

కృష్ణా: గన్నవరం బాలుర ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రధానోపాధ్యాయురాలు సునీల తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రవేశాలకు సెప్టెంబర్ 15 చివరి తేదీగా తెలిపారు. వివరాలకు 9490798909ను సంప్రదించాలి.