హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి పట్టివేత.. కేసు నమోదు..!

KNR: తిమ్మాపూర్‌ రామకృష్ణ కాలనీలోని ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో ఎల్‌ఎండీ పోలీసులు 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన పోలీసులు పెద్దపల్లికి చెందిన సాయిచరణ్‌ను గంజాయితో పట్టుకున్నారు. అతడితో ఉన్న న్యాదరి శశి పరారయ్యాడు. సాయిచరణ్‌పై కేసు నమోదు చేసి, పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.