హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట శిబిరంపై దాడి.. ముగ్గురి అరెస్ట్

GDWL: ఉండవెల్లి(M) బస్వాపూర్‌లోని చెత్త డంపింగ్ యార్డు సమీపంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారంతో ఎస్‌ఐ బి.సురేశ్ సిబ్బందితో కలిసి దాడి చేసి వెంకటేశ్వర్లు, రామచంద్రుడు, నాగరాజులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,930 నగదు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు.