హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆర్టీసీ బస్సులో మంత్రి ప్రయాణం

SDPT: రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పందిళ్ల నుంచి హుస్నాబాద్ బస్‌స్టేషన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహిళా ప్రయాణికులు ఆయనకు రాఖీలు కట్టగా, వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఇప్పటివరకు రూ.12 వేల కోట్ల విలువైన సేవలు అందించామని తెలిపారు. పండుగ సందర్భంగా 5 వేల బస్సులను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.