BHPL: టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లిలో రక్షాబంధన్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వినోద తన పెంపుడు కుక్కను కుటుంబ సభ్యుడిగా భావించి రాఖీ కట్టి ప్రేమానురాగాలను చాటుకున్నారు. కుక్కకు తిలకం దిద్ది, మిఠాయి తినిపించి ప్రత్యేకంగా రక్షాబంధన్ వేడుక నిర్వహించారు. కుక్కకు రాఖీ కడుతున్న దృశ్యం గ్రామస్థులను ఆకట్టుకుంది.
తెలంగాణ
పెంపుడు కుక్కకు రాఖీ కట్టిన మహిళ


