భూపాలపల్లి పట్టణంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ పుట్ట శైలజ పలువురు ముస్లిం, మైనార్టీ నాయకులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ ప్రతీక అని పేర్కొన్న ఆమె, కులమతాలకు అతీతంగా అందరూ రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. ఆప్యాయత, పరస్పర రక్షణకు రాఖీ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.
తెలంగాణ
రాఖీ పండుగతో సోదరభావానికి ప్రతీకగా పుట్ట శైలజ


