హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారిశుద్ధ్యంపై కలెక్టర్ ఆగ్రహం

NRPT: మక్తల్ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్ ప్రియాంక అసహనం వ్యక్తం చేశారు. బస్టాండ్ పరిసరాల్లో చెత్త పేరుకుపోవడం, డ్రైనేజీ నీరు రోడ్డుపై ప్రవహించడం, వాహనాలను అడ్డదిడ్డంగా నిలపడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పారిశుద్ధ్య పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం భవన నిర్మాణ పనులన గడువులో పూర్తి చేయాలన్నారు.