MHBD: డోర్నకల్ పట్టణంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రునాయక్ శుక్రవారం సోదరీమణులతో కలిసి రాఖీ వేడుకలు జరుపుకున్నారు. సోదరీమణులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాఖీ దారం ప్రేమ, నమ్మకం, బాధ్యతలకు ప్రతీక అని రాంచంద్రునాయక్ పేర్కొన్నారు. ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
రాఖీ వేడుకల్లో ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్


