ములుగు జిల్లాలో పాత కలెక్టరేట్‌లో కొనసాగుతున్న జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయాన్ని శుక్రవారం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి తరలించినట్లు డీపీఆర్ఓ ఎం.డి. రఫీక్ తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని జీ–20 గదిని కార్యాలయానికి కలెక్టర్ కేటాయించారు. ఇకపై అధికారిక సమాచార వ్యవహారాలు, మీడియా సమన్వయం, ఇతర శాఖా కార్యకలాపాలు ఐడీఓసీ నుంచే కొనసాగుతాయన్నారు.
తెలంగాణ
నూతన సమీకృత కలెక్టరేట్‌కు డీపీఆర్ఓ కార్యాలయం తరలింపు


