జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో రాఖీ పండగ సందర్భంగా మార్కెట్ ప్రాంతం సందడిగా మారింది. పండుగ కొనుగోళ్ల కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఎస్సై ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.
తెలంగాణ
రాఖీ సందర్భంగా పోలీసుల బందోబస్తు


