హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

KMM: వేంసూరు మండలం భీమవరం గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే మట్టా రాగమయి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచాయతీ ప్రజలకు, పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.