హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీ సందేశం.. ప్రతి మహిళకు గౌరవం!

NRML: రాఖీ పౌర్ణమి వేళ సమాజంలో సరికొత్త ఆత్మీయ సందేశాన్ని చాటుకుందాం. రక్షాబంధన్ అంటే కేవలం సొంత తోబుట్టువులకే పరిమితం కాదు. సమాజంలోని ప్రతీ మహిళకు గౌరవం ఇస్తూ, అండగా నిలవడమే ఈ పండుగ నిజమైన పరమార్థం. అపరిచిత మహిళలకు సైతం ఆపదలో తోడుంటూ, వారి భద్రతకు బాధ్యతగా కట్టుబడి ఉందాం. మహిళా రక్షణే ధ్యేయంగా ఈ పవిత్ర రాఖీ పండుగ సాక్షిగా మనమందరం కలిసికట్టుగా పాటుపడదాం.