హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివాజీ సేన జిల్లా అధ్యక్షుడిగా సిరంగి సతీశ్

మంచిర్యాల జిల్లా శివాజీ సేన అధ్యక్షుడిగా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన సిరంగి సతీశ్ నియమితులయ్యారు. ఈ మేరకు శివాజీ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తోట మధుకర్ శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్బంగా సతీశ్ మాట్లాడుతూ.. దేవాలయ భూముల అన్యాక్రాంతాన్ని అడ్డుకోవడంతో పాటు కులవివక్ష నిర్మూలనకు కృషి చేస్తానన్నారు. ఆలయాల పరిరక్షణకు పాటుపడతానని తెలిపారు.