హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆ కళాశాలలో 18 ఏళ్లుగా సిబ్బంది కొరత..!

ADB: ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు బీఎడ్ విద్య అందించేందుకు ఉట్నూర్ మండలం లాల్‌టెక్డిలో 2008లో కళాశాలను ప్రారంభించారు. 2014లో ఉట్నూర్‌లోని సొంత భవనానికి మార్చారు. అయితే, కళాశాల 18 ఏళ్లుగా కొనసాగుతున్నా ప్రభుత్వం ఇప్పటివరకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేయలేదు. దీంతో ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై వినియోగిస్తున్నారు.