హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

NRML: ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజాసేవలో భాగంగా ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ తూమొల్ల దత్తాత్రి స్వయంగా రక్తదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు రక్తదానం చేశారు.