హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా రక్షాబంధన్

NRML: ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సోదరి శాంతాబాయి ఆయనకు రాఖీ కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక అని, ఒకరికొకరు రక్షగా ఉంటూ దేశానికి రక్షణగా నిలవాలని అన్నారు.