హైదరాబాద్: 28°C
తెలంగాణ

తోబుట్టువుల ప్రేమకు రాఖీ ప్రతీక: గాంధీ

RR: రక్షాబంధన్ సందర్భంగా శేరిలింగంపల్లి నివాసంలో పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీని మహిళా నేతలు కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ కేవలం దారం కాదని, తోబుట్టువుల మధ్య ప్రేమ, రక్షణ, ఆప్యాయతలకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకురాళ్లు మంజుల, రాధాబాయి, లక్ష్మి, పద్మ పాల్గొన్నారు.