హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

విశాఖ పశ్చిమలో కోరమాండల్ ఇంటర్నేషనల్ CSR, సమగ్ర శిక్షా నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. ముందుగా 37 మంది మహిళలకు ఉపాధి పరికరాలు, వీధి వ్యాపారులకు 100 గొడుగులు పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని, విద్యార్థుల్లో నైతిక విలువలు, దేశభక్తి పెంపొందాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.