హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ జనతా వారధి కార్యక్రమం

KKD: జిల్లా బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ‘జనతా వారధి’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు రోడ్లు, తాగునీరు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డుల సమస్యలపై అర్జీలు అందజేశారు. వాటిని సంబంధిత అధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుండల సాయికుమార్ యాదవ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.