హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు బోగీలో మంటలు

విశాఖలోని మర్రిపాలెం కోచింగ్ కాంప్లెక్స్‌లో నిలిపి ఉంచిన ఒక రైలు బోగీలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగి మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన ఆర్‌పిఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి మంటలను అదుపు చేశారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుయాల్సి ఉంది.