హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంటాకు రాఖీ కట్టిన విద్యార్ధినులు

VSP: భీమిలి నెహ్రూ స్కూల్ విద్యార్ధినులు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. భీమిలి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన్ను కలిసిన వారు రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. విద్యార్థినులు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని గంటా ఆకాంక్షించారు. ఎలాంటి సమస్య ఉన్నా వారు తనను నేరుగా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.