హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయిలో బంగారు పతకం

PDPL: ధర్మారం మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలకు చెందిన వీ.అఖిల (ఇంటర్ రెండో సంవత్సరం) రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ హై జంపులో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఈనెల 26, 27 తేదీలలో జరిగిన అండర్ 20 విభాగంలో బంగారు పతకం సాధించినట్లు ప్రిన్సిపల్ రాజకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అఖిలను ప్రిన్సిపల్ రాజకుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు సంజీవరావు, కొమురయ్య అభినందించారు.