VZM: రాఖీ పండుగ సందర్భంగా ముంజేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు చెట్లకు రాఖీలు కట్టి వినూత్నంగా పండుగ జరుపుకున్నారు. చెట్లను సోదరులుగా భావిస్తూ వాటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మొక్కలు నాటి.. ‘‘చెట్లను కాపాడతాం.. మొక్కలను నాటుతాం.. ప్రకృతిని పరిరక్షిస్తాం’’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం హేమలత పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చెట్లకు రాఖీ కట్టి ప్రకృతి పరిరక్షణకు ప్రతిజ్ఞ


