CTR: జాతీయ రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నగరి దళితవాడకు చెందిన 17 మంది బాధితులకు నగరి తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ శుక్రవారం ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. అర్హులైన బాధితులకు ప్రభుత్వం పునరావాసం కల్పించే చర్యల్లో భాగంగా పట్టాలు అందజేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాలు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బాధితులకు పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే


