హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హాస్టల్ భవనాల కోసం విద్యార్థుల ధర్నా

అన్నమయ్య: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ భవనాలను తిరిగి విద్యార్థులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ సుమారు 150 మంది విద్యార్థులు శుక్రవారం కళాశాల గేటు వద్ద ధర్నా నిర్వహించారు. AISP రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల లవకుమార్ ఆధ్వర్యంలో తరగతులు బహిష్కరించి నిరసన చేపట్టారు. ప్రస్తుతం 250 మంది విద్యార్థులకు హాస్టల్ వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.