హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య సేవలపై ఎమ్మెల్యే సమీక్ష

KMR: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వైద్య అధికారులతో సమావేశమయ్యారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రుల్లో సౌకర్యాలు, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై సమీక్షించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. విధుల పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.