అన్నమయ్య: కె.వి.పల్లి పోలీస్ స్టేషన్‌ను ఇవాళ జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సందర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసులకు ఎస్పీ కీలక ఆదేశాలు


