ప్రకాశం: రాఖీ పండుగ సందర్భంగా కొత్తపట్నం బీచ్కు శుక్రవారం పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. పండుగ కావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సముద్ర తీరానికి చేరుకున్న ప్రజలు సరదాగా గడిపారు. ఉదయం నుంచే బీచ్లో సందడి నెలకొంది. చిన్నారులు, యువత సముద్ర తీరంలో ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. రోజూ కాస్తున్న ఎండకు ప్రజలు బీచ్‌లో సేదతీరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రాఖీ పండుగ వేళ కొత్తపట్నం బీచ్‌లో సందడి


