హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అయినవిల్లిలో భారీ వర్షం

కోనసీమ: అయినవిల్లి మండలంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్ర ఎండతో ఉక్కపోతగా ఉన్న వాతావరణం మధ్యాహ్నానికి మేఘావృతమై భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి వాహనదారులు, ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.