హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలకు స్థలం దానం చేసిన రాణెమ్మ

CTR: పుంగనూరు తాటిమాకులపాళ్యం ప్రభుత్వ పాఠశాలకు వంటగది నిర్మాణం కోసం స్థానికురాలు రాణెమ్మ సుమారు రూ.25 లక్షల విలువైన సొంత స్థలాన్ని విరాళంగా అందించారు. అంతేకాకుండా కేవలం 15 రోజుల్లో వంటగది నిర్మాణాన్ని పూర్తి చేయించారు. నూతన వంటగదిని శుక్రవారం రాణెమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా MEO రెడ్డన్న శెట్టి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆమెను అభినందించి సన్మానించారు.