NLR: కావలి పరిధిలోని అల్లూరు రోడ్డు రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి వయసు దాదాపుగా 30 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మృతుడు కాపీ కలర్, గోధుమ రంగు చెక్స్ డిజైన్ చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు సమాచారం. ఇతర ఆధారాలు లభించకపోవడంతో అతడి ఆచూకీ తెలియాల్సి ఉన్నది.
ఆంధ్రప్రదేశ్
రైలు కిందపడి వ్యక్తి మృతి


