హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిశుభ్రతతోనే వ్యాధుల నివారణ: అదనపు కలెక్టర్

WNP: పట్టణంలోని 19, 20, 8వ వార్డుల్లో నిర్వహించిన డ్రై డే కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పరిశీలించారు. దోమల నివారణకు యాంటీ లార్వా చర్యలు నిరంతరం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకుని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని ప్రజలకు సూచించారు. పరిసరాలను నిర్లక్ష్యం చేస్తే ప్రతి ఒక్కరు మూల్యం చెల్లించుకుంటారని అన్నారు.