హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మత్స్యకారులకు చిక్కిన అరుదైన పీతలు

కోనసీమ: అల్లవరం మండలం ఓడలరేవు తీరంలో శుక్రవారం వేటకు వెళ్ళిన మత్స్యకారుల వలకు అత్యంత అరుదైన పస పీతలు చిక్కాయి. సముద్రంలో సాధారణంగా కనిపించని ఈ రకం పీతలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఒక్కో పీత సుమారు రూ.1500 నుంచి రూ.2000 వరకు ధర పలుకుతుందని మత్స్యకారులు వెల్లడించారు. ఈ అరుదైన పీతలను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.