PLD: నూజెండ్ల(M) ఐనవోలు గ్రామంలో రూ.1.93 కోట్లతో నిర్మించనున్న నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేసి పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పీహెచ్సీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చీఫ్ విప్


